కుందనపు బొమ్మ ‘విద్యాబాలన్’ పుట్టినరోజు..

356
vidya-balan
- Advertisement -

గ్లామర్ తో కుర్రకారుకు పిచ్చెక్కించే హీరోయిన్లు ఇండస్ట్ర్రీలో చాలా మందే ఉంటారు. కానీ ఆ గ్లామర్ కు నటన తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి కొద్దిమంది హీరోయిన్లు ఉంటారు. ఆ కొద్దిమందిలో తప్పని సరికా చెప్పుకోవాల్సిన పేరు విద్యాబాలన్..అందానికి అందం..అంతకు మించి నటన. ఇవే విద్యాను బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. కేవలం అందాన్నే నమ్ముకోకుండా నటనను నమ్ముకుని హీరోయిన్ల మద్య ఎంతపోటీ ఉన్నా..తనదైన ప్రతిభతో స్టార్ గా ఎదిగింది. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో లేడి అమీర్ ఖాన్ గా పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే విద్యాబాలనే గుర్తుకు వస్తుంది. డర్టీ పిక్చర్ కంటే ముందు హీరోయిన్‌గా విద్యాబాలన్ పేరు ఎవరికి అంతగా తెలియదు. డర్టీపిక్చర్ తర్వాత విద్యా పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

vidya-balan

అందానికి నటన తోడైతే ఎలా ఉంటుందో..అలా డర్టీ పిక్చర్ సినిమాతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారుకు చమటలు పట్టించింది. ఆ సినిమా తర్వాత కూడా విద్యా వైవిద్యమైన పాత్రల వేట కొసాగింది. కహానీ, కహానీ2 ఇలా బాలీవుడ్‌ లో తనదైన ముద్ర వేసుకుంది. రీసెంట్‌గా రిలీజైన కహానీ2 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే విద్యాబాలన్ సినిమాలకు..నిజజీవితంలో చాలా తేడా కనబడుతుంది. పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి గ్లామర్ పాత్రలకు సై అనే విద్యా బయట మాత్రం చాలా పద్దతిగా కనబడుతుంది. పార్టీలకు కూడా నిండైన చీరతో దర్శనమిస్తుంది. చీరతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది.

vidya-balan

విద్యాబాలన్‌ ముంబయిలోని చెంబూర్‌లో జన్మించారు. ముంబయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తిచేసిన విద్యకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువే. అలనాటి నటులు షబానా అజ్మి, మాధురి దీక్షిత్‌లంటే చాలా ఇష్టం. వారి స్ఫూర్తితోనే సినీ రంగంలోకి రావాలనుకున్నారు. అలా 1995లో వచ్చిన కామెడీ సీరియల్‌ ‘హమ్‌పాంచ్‌’తో విద్య నట ప్రయాణం మొదలుపెట్టారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశం కోసం విద్యా ఎంతో కష్టపడ్డారు. విద్యకు తొలినాళ్లలో ప్రముఖ మళయాళీ నటుడు మోహన్‌లాల్‌కు జంటగా చక్రం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి ఇష్టపడేవారు. అలా వచ్చినసినిమాలే ‘ద డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’. విద్యా కెరీర్‌ గ్రాఫ్‌లో ఇవన్నీ ఒకెత్తైతే.. 2007లో వచ్చిన చంద్రముఖి రీమేక్‌ భూల్‌భులయ్యా చిత్రం మరోఎత్తు.

vidya-balan

సినీ రంగంలో ఎక్కువగా మహిళా ప్రాధాన్యత పాత్రలు ఎంచుకునే విద్యా నిజజీవితంలోనూ విద్యా అవసరంలో ఉన్న మహిళల కోసం తనకు తోచిన సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. సాధారణంగా సినిమా రంగంలో మహిళా ప్రాధాన్యతున్న సినిమాలతో పైకొచ్చే నటీమణులను అరుదుగా చూస్తుంటాం. అందులో విద్యా ఒకరు. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తాజాగా విద్యా నటించిన కహానీ-2చిత్రం డిసెంబర్‌ 2న విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఇలాంటి మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ విద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.

vidya-balan

- Advertisement -