తెలుగు రాష్ట్రాలకు జనసేన శుభాకాంక్షలు..

132
Pawan

సినీ నటుడు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ తరుపున ప్రెస్ నోట్‌ ను రిలీజ్ చేశాడు. 2017 రెండు తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు మంచి జరగాలని ఆశించిన పవన్‌..2016లో జరిగిన కొన్ని విషయాలపై ఘాటుగా స్పందించారు. 2016 ఎన్నో కష్ట్రాలను చవి చూసిందని..కరెన్సీ రద్దు రూపంలో సామాన్యూలను కాటేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను అందని మామిడి పండుగా మార్చిందని మండిపడ్డారు.

 pspk-3

కానీ2017 మన తెలుగు రాష్ట్ర్రాల ప్రజల ఆశలను సంపూర్తిగా నెరవేరుస్తుందని ఆక్షాంక్షించారు పవన్. మన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర్రాలు ప్రగతిపథంలో పయనించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. మొత్తానికి కేంద్రప్రభుత్వానికి చురకలు అట్టించేలా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. గత కొంతకాలంగా పవన్ ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నవిషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం పలుమార్లు బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేశారు.

 Pawan