ఉగ్రదాడి..35 మంది మృతి

106
Istanbul

ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునికిపోగా, టర్కీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడి సమయంలో నైట్‌క్లబ్‌లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.

Istanbul

శనవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్ లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ కథనం ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. సాయుధుడు నైట్‌క్లబ్ లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరిపింది ఎంతమంది అన్న దానిపై ఇంకా స్పష్టతలేదని పేర్కొన్న ఆయన.. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అభిప్రాయపడ్డారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

Istanbul

Istanbul