డిఫరెంట్ కాన్సెప్ట్‌తో విధి!

30
- Advertisement -

రోహిత్ నందా, ఆనంది జంటగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ నిర్మించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనాథ్ రంగనాథన్ కెమెరామెన్‌గా పని చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో

నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘‘విధి’ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఆడియెన్స్ అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరో రోహిత్ నందా మాట్లాడుతూ.. ‘‘విధి’ షూటింగ్‌, ఆ జర్నీ మాకు ఎంతో స్పెషల్. ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమా అనుభూతి చెందగలరు. శ్రీ చరణ్ పాకాల గారు అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. విజువల్ చాలెంజెడ్ వారికి కూడా ఈ సినిమాను వేసి చూపించబోతోన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది లక్షల మంది కంటి చూపు లేని వాళ్లున్నారు. అందులో 90 శాతం మంది థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చు. వాళ్లంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాధించవచ్చు. ఢిల్లీలోని సాక్ష్యం ఫౌండేషన్ ఈ యాప్ తయారు చేయడంలో సహాయం చేసింది. యూట్యూబ్‌ ద్వారా శ్రీకాంత్, శ్రీనాథ్ పరిచయం అయ్యారు. అలా మా విధి ప్రయాణం ప్రారంభం అయింది. ఆనందితో కంఫర్టబుల్‌గా పని చేశాను. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. మా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

Also Read:ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు..

దర్శకుడు, కెమెరామెన్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘సినిమాల్లోకి రాక ముందు నేను మీడియాలో పని చేశాను. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాను. మీడియా మా ఈ సినిమాను తమ సొంత సినిమాగా భావించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రంజిత్‌కు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘విధి మాకు మొదటి సినిమా. ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ లవర్. ఎన్నో మెమోరీస్ ఉంటాయి. అవన్నీ మున్ముందు చెబుతాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి, మా టీంకు థాంక్స్. మాలాంటి చిన్న సినిమా తీసేవాళ్లకి మీడియా సహకారం కావాలి. రైటింగ్ టైంలో మా బ్రదర్స్ ఇద్దరికీ గొడవలు వచ్చాయి. అన్నదమ్ములన్నాక గొడవలు సహజం. కానీ సెట్స్‌కి వచ్చాక అలాంటివేం జరగలేద’ని అన్నారు.

హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రంజిత్‌కు థాంక్స్. కొత్త వారికి, టాలెంట్ ఉన్న వారికి మా నిర్మాత ఛాన్స్ ఇస్తుంటారు. విధి సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. రోహిత్‌తో చాలా ఏళ్ల క్రితమే నటించాల్సింది. కానీ అప్పుడు మిస్ అయింది. విధితో మేం ఇద్దరం కలిసి రాబోతోన్నాం. విధి అందర్నీ ఎంటర్టైన్ చేయడమే కాదు థ్రిల్‌కు గురి చేస్తుంది’ అని అన్నారు.

శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘రోహిత్‌తో కలిసి నేను ఓ ఇండిపెండెంట్ సాంగ్ చేశాను. ఆ తరువాత ఆయన సోదరుడు రంజిత్ పరిచయం అయ్యాడు. రోహిత్ మంచి డ్యాన్సర్. సినిమా చేస్తున్నాడని తెలిసి ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటాడా? అని ఆలోచించాను. ఈ సినిమాలో ట్విస్టులు బాగుంటాయి. నేను ఇప్పటి వరకు చాలా థ్రిల్లర్స్ చేశాను. ఈ మూవీ నాకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రంగస్థలం మహేష్ మాట్లాడుతూ.. ‘రోహిత్ నాకు పదకొండేళ్ల నుంచి తెలుసు. విధి సినిమాలో మంచి ట్విస్టులుంటాయి. ప్రేక్షకులందరికీ సినిమా నచ్చతుంద’ని అన్నారు.

Also Read:మగవారు ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -