మరోసారి కరోనా బారినపడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య..

105
- Advertisement -

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆయన గతంలో 2020 సెప్టెంబరులో కరోనా బారినపడ్డారు. అయితే ఆ సమయంలో కరోనా నుంచి కోలుకున్న ఆయనకు తాజాగా రెండోసారి కరోనా సోకింది. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాదులోని తన నివాసంలో వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. కాగా, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు.

- Advertisement -