మరోసారి నోరు జారావో నాలుక చీరేస్తా.. ఖబడ్దార్..

82
- Advertisement -

మరో సారి నోరు జారావో నాలుక చీరేస్తా .. ఖబడ్దార్ అంటూ మాజీ టిడిపి ఎమ్మెల్యే చింతమనేనికి వార్నింగ్ ఇచ్చారు దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కే.కన్నాపురం గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ళను ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవెరుస్తున్నారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే ఓర్వ లేక టిడిపి నాయకులు ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారన్నారు.

దాదాపు 19 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, 340 కోట్ల రూపాయలు నిర్మాణానికి మంజూరు చేశారన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోనే ఇళ్ల నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వైసీపీ ,నాయకులను కార్యకర్తలను,ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడితే నీకు అక్కడే పరాభవం తప్పదని చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు అబ్బయ్య చౌదరి.. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బహిరంగ చర్చికి తాను సిద్ధమేనని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చింతమనేనికి హితవు పిలికారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.

- Advertisement -