పద్మ విభూషణ్ వెంకయ్యకు సత్కారం

14
- Advertisement -

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడుకి VHP శుభాకాంక్షలు తెలియజేసింది. శ్రీ వెంకయ్య నాయుడు గారికి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు వరించిన శుభ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం ఘనంగా సత్కరించింది. శుక్రవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బృందం భాగ్యనగర్ లోని వెంకయ్య నాయుడు గారి ఇంట్లో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. విశ్వహిందూ పరిషత్ సాహిత్యం అందజేసింది. ఈ సందర్భంగా పుస్తకాలు సంతోషంగా అందుకొని విశ్వహిందూ పరిషత్ ను అభినందించారు. పుస్తకాలను పరిశీలించి అందులో ఉన్నవారిని గుర్తించి వారి వివరాలు గుర్తు చేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ గారు, శ్రీ డాక్టర్ రాంసింగ్ గారు, రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ భాను ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ శ్రీ పగుడాకుల బాలస్వామి గారు, దుర్గా వాహిని రాష్ట్ర సంయోజక్ శ్రీమతి వాణి సక్కుబాయి గారు, పూర్వ ఏబీవీపీ కార్యకర్త శ్రీ మధు గారు కలిసి వెంకయ్య నాయుడు గారిని సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా వెళ్లిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా వారి పూర్తి వివరాలు, స్వగ్రామం అడిగి తెలుసుకున్నారు వెంకయ్య నాయుడు గారు.

ఉప రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించిన నాయుడు గారు.. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులుగా, కేంద్ర మంత్రివర్యులుగా పార్టీకి అనేక విధాలుగా సేవలందించారు. బాల్యం నుంచే జాతీయ భావాలు పనికి పుచ్చుకున్న నాయుడు .. తన ప్రతిభతో అత్యున్నత పదవులు చేపట్టడం విశేషం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, ఆర్థికంగా వెనుకబడిన వ్యవస్థ నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు గారు జాతీయ వాద సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసి భారత రాజకీయాలలో ఓ కీలక శక్తిగా ఎదగడం గొప్ప విశేషం. అతి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయుడు గారు భారత రాజకీయాలలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న మహనీయులు. గ్రామీణ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. భారత రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన గొప్ప రాజా నీతజ్ఞుడు వారు. వారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందజేసి సత్కరించడం వారు విదేశానికి చేసిన సేవలకు సాక్షాత్కారంగా చెప్పవచ్చు. వారు తెలుగు ప్రజలకే కాదు, భారత ప్రజలు గర్వపడే రీతిలో దేశానికి సేవలందించిన శుభ సందర్భంగా మరోసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పురస్కారాలు అందుకోవాలని VHP పెద్దలు ఆకాంక్షించి, అభినందించారు.

Also Read:ఫ్యామిలీ స్టార్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -