మొక్కలు నాటిన సింగర్ శ్రేయా

52
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న గాయని శ్రేయా ఘోషాల్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా గాయని శ్రేయా ఘోషాల్ మాట్లాడుతూ..ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గొప్ప కార్యక్రమమని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత గొప్పదనిఅన్నారు. సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.

Also Read: మే..మూత్రాశయ క్యాన్సర్ అవగాహన నెల

ప్రకృతికి పాటకు వీడదీయలేని బంధం ఉంటుందన్నారు. ఈ రెండింటి సమన్వయంతో మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు శ్రేయా ఘోషాల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు సింగర్ శంకర్ మహాదేవన్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన శ్రేయా…ఈ కార్యక్రమంను మరో ముగ్గురికి ట్విటర్ ద్వారా సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియాఛాలెంజ్ కరుణాకర్ రెడ్డి రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.

Also Read: సిక్కు అధ్యాత్మిక గురువు ఇక్బాల్ సింగ్ పుట్టిన రోజు

- Advertisement -