వేసవిలో బీరు తాగుతున్నారా..జాగ్రత్త!

101
- Advertisement -

వేసవిలో శీతల పానీయాలు తాగడం సర్వసాధారణం. అయితే మద్యం ప్రియులు మాత్రం బీరు ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతుంటారు. ప్రపంచం మొత్తం మీద నీరు, టీ వంటి పానీయాల తరువాత చాలామంది ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. కాగా బీరు తాగడం వల్ల వేసవి తాపం తీరుతుందని, చలువ చేస్తుందని చాలమంది నమ్ముతుంటారు. అందుకే వేసవిలో బీర్లకు యమ డిమాండ్ ఉంటుంది. ఇక బీరు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయని వార్తల్లో వింటూ ఉంటాము. బీరు తాగడం వల్ల కండరాలు బలం పెంచుకుంటాయని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే బీరున అత్యంతా తక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయట. బీరు మితంగా తాగితే అలసట, ఒత్తిడి,భయం వంటివి దూరం అవుతాయని కొంత మంది చెబుతుంటారు. .

అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే బీరు అనేది ఒక ఆల్కహాల్ పానీయం. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అనే సంగతి అందరికీ తెలిసిందే. బీరు ఎక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంటకు దారి తీస్తుంది. లివర్ వేగంగా చెడిపోయే ప్రమాదం ఉంది. ఇక బీరు అధికంగా తాగిన వారిలో తల తిరగడం, బలహీనత, మూర్ఛ, మైకం, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు, మతిస్థిమితం లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా ఈ వేసవిలో బీరు ఎక్కువగా తాగడం వల్ల త్వరగా డీహైడ్రేట్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీరులో శరీరంలోని సోడియం శాతాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి బాడీ నీటి శాతాన్ని తగ్గించి డీహైడ్రేట్ కు గురి చేస్తుంది. ఇక పురుషుల్లో సంతానోత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆల్కహాల్ శాతం ఉండే బీరుకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నమాట. అయితే బీరుకు బదులుగా వేసవిలో పండ్ల రసాలు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు వంటివి తాగాలని నిపుణులు చెబుతున్నారు.

 Also Read:Trivkram:త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే?

- Advertisement -