రెండో సినిమా కూడా దిల్ రాజుకే!

80
- Advertisement -

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి నచ్చితే ఆ దర్శకుడికి వరుస అవకాశాలు ఇస్తుంటాడు ఇది అందరికీ తెలిసిందే. దిల్ రాజు బేనర్ నుండి దర్శకుడిగా పరిచయమైన చాలా మంది సక్సెస్ ఫుల్ దర్శకులు అదే బేనర్ లో రెండో సినిమా చేసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ , శ్రీకాంత్ అడ్డాల , వేణు శ్రీరామ్ , వంశీ పైడి పల్లి , వాసు వర్మ వంటి దర్శకులు మొదటి సినిమాతో పాటు రెండో సినిమా కూడా దిల్ రాజు కే చేశారు.

ఇక హిట్టు ఇచ్చిన దర్శకులను కూడా వెంటనే మరో సినిమాకు బ్లాక్ చేయడం దిల్ రాజు నైజం. అనిల్ రావిపూడి , వేగేశ్న సతీష్ , త్రినాద్ రావు నక్కిన ఇలా కొందరు దర్శకులు సక్సెస్ కొట్టి మళ్ళీ అదే బేనర్ కి మరో సినిమా చేసిచ్చారు. ఇప్పుడు దిల్ రాజు బేనర్ నుండి డెబ్యూ ఇచ్చిన కమెడియన్ వేణు కూడా దిల్ రాజుకే రెండో సినిమా చేయబోతున్నాడు.

బలగం సినిమాతో దిల్ రాజు వేణు టాలెంట్ కి ఇంప్రెస్ అయిపోయాడు. ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజుకి బాగా దగ్గరయ్యాడు వేణు. అందుకే బలగం ఇంకా థియేటర్స్ లో ఉండగానే వేణుకి మరో అవకాశం ఇస్తున్నాడు. తాజాగా దిల్ రాజు కి వేణు ఓ కథ తాలూకు క్లైమాక్స్ చెప్పాడు. అది దిల్ రాజుకి బాగా నచ్చడంతో వేణుకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు.

ఏదేమైనా డెబ్యూ సినిమా తర్వాత ఏరి కోరి మళ్ళీ నిర్మాత దర్శకుడికి రెండో సినిమా అవకాశం ఇచ్చాడంటే , అదీ దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అంటే వేణుకి దర్శకుడిగా కలిసొచ్చినట్టే. తెలంగాణా నేపథ్య కథతో మొదటి కినేమగా ‘బలగం’ తీసి దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న వేణు రెండో సినిమాకు ఎలాంటి కథ ఎంచుకున్నాడో ? ఎలా మెప్పిస్తాడో? మరి !

ఇవి కూడా చదవండి..

- Advertisement -