ఎన్టీఆర్ కి జాన్వీ అధికారికంగా ఖరారు

43
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. ఐతే, ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌ ను ఈ సినిమా టీమ్ తాజాగా అధికారికంగా రివీల్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ప్రకటిస్తూ చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది. నేడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ జాన్వీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా షూట్ లో జాయిన్ కానుంది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కలిసి నటిస్తే.. ఆ స్క్రీన్ విజువల్స్ అదిరిపోతాయి.

పైగా జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్.. సో.. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా, ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఆ బజ్ కి తగ్గట్టుగానే ఖర్చు కూడా పెడుతున్నారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఓ హాలీవుడ్‌ యాక్షన్ కొరియగ్రాఫర్ ను తీసుకోబోతున్నారు. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -