వేణు మాధవ్ చివరి కోరిక ఏంటో తెలుసా?

553
venu-madhav
- Advertisement -

ప్రముఖ కమెడీయన్ వేణు మాధవ్ తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 600లకు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వేణు మాధవ్ 1996లో సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు. గోకులంలో సీత, మాస్టర్, తొలిప్రేమ, తమ్ముడు, యువరాజు, ఆది, సొంతం, నువ్వే నువ్వే, జెమిని, దిల్, సింహాద్రి, వెంకీ, గుడుంబా శంకర్, సై, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించి మెప్పించారు. మెగా ఫ్యామిలి సినిమాల్లో ఎక్కువగా నటించారు. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.

వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. అయితే వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేశాడు. అదే సమయంలో టీడీపీ నేతలతో అనుబంధం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా కూడా పనిచేశారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. సీనియర్ ఎన్టీఆర్ వేణు మాధవ్ ను బొమ్మగారూ అని పిలిచేవారు. వేణు మాధవ్ కు రాజకీయాలంటే చాలా మక్కువ. ఆయన టీడీపీ తరుపున ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు.

వేణు మాధవ్ చివరి కోరిక తీరకుండానే మరణించాడు. ఆయన చివరి కొరిక ఎంటి అంటే ఒక్కసారి అయిన ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆయన కోరిక. ఇందుకోసం చాలా సార్లు ప్రయత్నాలు చేశాడు. తన సొంత గ్రామం అయిన కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అది సాధ్యం కాలేదు. 2014ఎన్నికల్లో టీడీపీ నుంచి కోదాడ అసెంబ్లీ స్ధానానికి పోటీ చేసేందుకు ప్రయత్నించగా అవకాశం రాలేదు. దీంతో 2018ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించిన అతని అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక వేణు మాధవ్ కు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో రాణించాలనే కోరిక తీరకుండానే వేణు మాధవ్ కన్ను మూశారు.

- Advertisement -