28న వేణుమాధవ్ విగ్రహావిష్కరణ..

207
venu madhav

టాలీవుడు హాస్యనటుడు వేణుమాధవ్ విగ్రహాన్ని ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కరీనంగర్‌ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేటలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

వేణుమాధవ్ 600 సినిమాల్లో నటించారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని కూడా వేణుమాధవ్ అందుకున్నారు. లివర్, కిడ్నీ సమస్య గతేడాది సెప్టెంబర్ 25న మృతిచెందారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చివరిగా రుద్రమదేవి సినిమాలో నటించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సినిమాల నుండి తప్పుకున్నారు.