ప్రస్తుతం సినిమా నటులే బోలెడన్ని వ్యాపారాలు చేసేస్తున్నారు. ఇప్పటికే రకరకాల వ్యాపారాల్లో సినీ నటులు నిమగ్నం కాగా.. ఇఫ్పుడు ఓ సీనియర్ హీరో కూతురు తన అదృష్టం పరీక్షించుకోనుంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితకు కలినరీ ఆర్ట్స్ అంటే మహా ఇష్టం. ఈ విషయంలో కొన్ని ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఈమె పూర్తి చేసేసింది. ఇప్పుడు తన ఆసక్తి.. ఇష్టం.. అభిరుచిలను బేస్ చేసుకుని వ్యాపారం ప్రారంభించేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిస్కెట్స్ తయారీలో వెంకీ డాటర్ నిమగ్నం కానుంది.
ఇలా కుకీస్ వ్యాపారంతో తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవాలని ఓ హీరో డాటర్ ఫిక్స్ కావడం ఆసక్తి కలిగించే విషయమే. ఇప్పటికే ఈమె తయారు చేసిన కుకీస్ ను.. రామానాయుడు స్టూడియోస్ లో స్టాల్స్ ద్వారా విక్రయిస్తున్నారు. ఆసక్తి కలవారు ఈ స్టాల్స్ లో కుకీస్ కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే రిటైల్ ఔట్ లెట్స్ ద్వారా తన బిస్కెట్లను విక్రయించనుందిట అశ్రిత. అంతే కాదు.. తండ్రి వెంకటేష్ సహకారంతో భారీ స్థాయిలో ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా వేసుకుందని.. ఇందుకు వెంకీ కూడా పూర్తి సపోర్ట్ ఇస్తున్నాడని సమాచారం.