పవన్‌ ఫస్ట్‌ లుక్‌ ఇప్పట్లో లేదట..?

195
Pawan 25th Film First Look Launch?
- Advertisement -

పవన్‌ కల్యాణ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. దీపావళికి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.

Pawan 25th Film First Look Launch?

ముందుగా దసరా సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. కానీ అదికాస్తా వాయిదా పడింది. నవంబర్‌7న త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. దాంతో ఈ చిత్రంలో పవన్‌ ఎలా ఉండబోతున్నారో చూడాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు అది కూడా నెరవేరేలా లేదు.

ఇప్పటికైతే ఎలాంటి ఫస్ట్‌లుక్‌ కానీ టైటిల్‌ లోగో కానీ విడుదల చేసే అవకాశం కన్పించడంలేదని చిత్రవర్గాలు వెల్లడించాయి. టీజర్‌ విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతోందో తెలీడంలేదు. దీనిపై చిత్రబృందం కూడా ఇంకా స్పందించలేదు. సంక్రాంతి సందర్భంగా 2018 జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -