విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీమామ. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవీంద్ర ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇటివలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు.
రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్ ప్రై.లి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతలు. ఈమూవీని సంక్రాంతికి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. జనవరి 11న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.