ఎఫ్‌3 టీంకు వెంకీ పార్టీ..!

70
varun
- Advertisement -

ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావిపూడి . ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తుండగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఎఫ్‌3 టీంకి వెకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చాడు. ఈ విషయాన్ని అనిల్‌ రావిపూడి, వరుణ్‌ తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ..వెంకీ బ్రో ఇంట్లో టీ పార్టీ ఎంజాయ్‌ చేస్తున్నాం అంటూ ట్విట్‌ చేశాడు. ఎఫ్‌3లో డబ్బు సంపాదిం చేందుకు హిరోలు పడే కష్టాలు, దాని నుంచి వచ్చే వినోదాన్ని చూపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌ రేచీకటి ఉన్నవాడిగా.. వరుణ్‌ తేజ్‌ నత్తి ఉన్నవాడిగా నటిస్తున్నారని సమాచారం.

- Advertisement -