పూరితో ఘర్షణ సీక్వెల్ ..!

112

టాలీవుడ్ అగ్రహీరోలు కెరియర్ లో మైలురాయికి చేరువయ్యారు. చిరంజీవి 150 మూవీతో, బాలయ్య 100 మూవీతో ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో దూకేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది. కెరియర్ లో వెంకీ 75 మూవీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ అగ్రహీరో 73వ చిత్రం గురు విడుదలకురెడీ అవుతోంది. దీని తరువాత నేను శైలజ ఫేమ్ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చేయబోతున్నాడు. ఫ్యామిలీ రొమాంటిక్
చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రంలో వెంకీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం.

Venkatesh to team up with Puri Jagannadh

ఆ తరువాత వెంకటేష్ తన 75 వ చిత్రాన్ని పూరి కాంబినేషన్ లో చేస్తాడని టాక్.ఇందులో వెంకటేష్ కు జంటగా మొదటి సారి కాజోల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.టెంపర్ తరువాత తెరకెక్కించిన సినిమాలేవి,ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో పూరి సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ ఘర్షణకు సెక్వెల్ లా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను కాస్తగ్యాప్ తో సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ.