ఊహించని కాంబినేషన్ లో బాలయ్య మూవీ?

139

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఊహించని కాంబినేషన్ లో రాబోతుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణవంశీతో బాలయ్య రైతు మూవీ చేయాలనుకున్నా..దానికి మరోసారి బ్రేక్ పడింది. అదే సమయంలో బోయపాటిని కథ సిద్ధం చేయాల్సిందిగా బాలయ్య బాబు కోరాడని వార్తలు వినిపించాయి. అయితే బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నాడు. దీంతో బాలయ్య ప్రముఖ దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డితో ఓ భారీ మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

Balakrishna said no to SV Krishna Reddy's film

బాల కృష్ణ సినీజీవితంలో 1000 రోజులు పైగాఆడిన లెజెండ్ చిత్రాన్ని నిర్మించిన వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎస్ వి ,కృష్ణారెడ్డి గతంలో బాలకృష్ణ తో టాప్ హీరో వంటిమ్యూజికల్ హిట్ అందించాడు. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం బయటకు రాలేదు.నిజానికి బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సందేశాత్మక చిత్రం చేస్తాడని భావించారు. దీనికోసం ఒక పాత్ర కోసం అమితాబ్ ను బాలకృష్ణ, కృష్ణవంశీ వెళ్లి స్వయంగా సంప్రదించారని వార్త వచ్చింది. మరి, 101 చిత్రం బాలయ్య ఎవరితో చేయనున్నాడో చూడాలి.