టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ…..

112
Stanford team meets Ktr

స్టాన్ పర్డ్ యూనివర్సీటీ అధ్యాపకులు, విద్యార్ధులు మంత్రి కెటి రామారావు ను ఈ రోజు హైదరాబాద్ లో కలిసారు. భారతదేశ ఇన్నోవేషన్ రంగంలో సవాళ్లు అనే అంశంపైన పరిశోధన చేస్తున్న ఈ యూనివర్సీటీ బృందం దేశంలోని పలువురు మేధావులు, పాలసీ మేకర్స్ ను కలుస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసిన విద్యార్ధులు, అధ్యాపకులు దేశ రాజకీయ పరిస్ధితులు, ప్రభుత్వాల విధివిధానాలు, పాలసీ నిర్ణయాలపైన కూలంకషంగా చర్చించారు.

Stanford team meets Ktr

ముఖ్యంగా దేశంలో పరిశోధనలు, అవిష్కరణలను నిర్ణయించే మౌళిక వసతులు కల్పన, విద్యా విధానంలో మార్పులు, ప్రభుత్వాలు కల్పించే వసతులపైన మంత్రితో చర్చించారు. దేశంలోని యువతరం అకాంక్షలను అర్ధం చేసుకోవడంలో ప్రభుత్వాలు ఎవిధంగా విజయవంతం అవుతున్నాయో కూలకంషంగా చర్చించారు. యూనివర్సీటీ బృందం అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.ఇన్నోవేషన్ రంగంలో ప్రభుత్వం తీసుకుని వచ్చిన ప్రత్యేక పాలసీలు, టీ హబ్ వంటి కార్యక్రమాలను వివరించారు.

Stanford team meets Ktr

ఇప్పటికే టిహబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్ అని వివరించిన మంత్రి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే రెండో దశలో టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్ అవుతుందన్నారు. ఇన్నోవేషన్ రంగాన్ని, టీ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని వివరిస్తూ, ఈ రెండు కార్యక్రమాలకు స్టాన్ పోర్డ్ యూనివర్సీటి లాంటి సంస్ధల సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ దిశగా టీ బ్రిడ్జి ద్వారా సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ సంస్ధలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పారిశ్రామిక ప్రగతి, పరిశ్రమల స్థాపన, టీ యస్ ఐపాస్ వంటి అంశాలను వివరించారు. దీంతోపాటు అదర్శవంతమైన విధానాలు ఏక్కడున్నా అచరించేందుకు ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

Stanford team meets Ktr

ప్రస్తుతం భారత దేశం నూతన భారతమన్న మంత్రి, దేశంలో పెట్టుబడులు పెట్టేముందు. ట్యాలెంట్‌ ను గుర్తించేందుకు రాష్ట్రాల్లోని పరిస్దితులను, ప్రభుత్వాలను అంచనా వేయాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా దేశం ఏంతగానే అభివృద్ది చేందిందని, రాబోయే కాలంలో మరింతా ముందుకుపోతుందని తెలిపారు.
అయితే స్టాన్ పోర్డ్ లాంటి యూనివర్సీటీలోంచి వచ్చే నూతన పారిశ్రామిక వేత్తలు టెక్నాలజీని భారత దేశానికి అనుకూలంగా మలిచినప్పుడు ఇక్కడ విజయవంతం అవుతాయని తెలిపారు. ఐటి రంగంలో అటోమేషన్ వస్తున్నప్పటికీ, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ వంటి రంగాల్లో ఉపాది అవకాశాలు పెరుగుతాయని వారు అడిగిన ఓక ప్రశ్నకు సమాధానం తెలిపారు.

Stanford team meets Ktr

ఈ సమావేశంలో స్టాన్ పర్ఢ్ యూనివర్సీటీ డైరెక్టర్ పర్ ఏంటర్ ప్రెన్యూరల్ స్టడీర్ పీటర్ సిరీస్ , 25 మంది స్టాన్ పోర్డ్ యంబీఏ గ్రాడ్యూయేట్లు, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.