ప్రేక్షకుల రెస్పాన్స్‌కు థ్యాంక్స్‌- హీరో వెంక‌టేష్

109
- Advertisement -

నారప్ప సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు హీరో వెంక‌టేష్. ఆయన హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌వీడియోలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో హీరో విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేశాను. కానీ ‘అసురన్‌’ చిత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించి, ‘నారప్ప’ చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్‌’ లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్‌ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్‌ చెప్పారు.

‘అసురన్‌’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్‌ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్‌పీ రియన్స్‌. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్‌ను అనంతశ్రీరామ్‌ బాగా రాశారు. ఈ లిరిక్‌ వినప్పుడు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చిన వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్‌. మళ్లీ ‘ఎఫ్‌ 3’వస్తుంది. సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తుంది` అని వెంకటేష్‌ అన్నారు.

- Advertisement -