సీఎం కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు..

55
ramappa

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు వారి బృందం ఈరోజు రామప్పను సందర్శించారు. ఈ సందర్భంగా రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని, టాక్ పక్షాన మరియు ఎన్నారైల పక్షాన కేసీఆర్‌కు కృతజ్ఞతాభివందనలు తెలియజేశారు. వరంగల్ బిడ్డగా రామప్పకు ఇంతటి గౌరవం రావడం గర్వంగా ఉందని, కృషి చేసిన స్థానిక నాయకులకు , ప్రభుత్వ అధికారులకు రత్నాకర్ కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు యునెస్కో గుర్తింపు లభించిన చారిత్ర కట్టడంగా రామప్ప ఉండడం సంతోషంగా ఉందని, నేటి గుర్తింపుతో రామప్ప పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నామని రత్నాకర్ తెలిపారు.

టాక్ ఉపాధ్యక్షుడు సత్య మూర్తి చిలుముల మాట్లాడుతూ.. నేడు టాక్ బృందంతో కలిసి రామప్పను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని మన సంస్కృతి సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో పని చేస్తున్న టాక్ సంస్థ, రామప్ప గొప్పతనం తో పాటు పర్యాటకంగా విదేశీలు సందర్శించే విధంగా ప్రత్యేకంగా కృషి చేస్తామని సత్య తెలిపారు.

టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపబడడం చాలా గర్వంగా ఉందని, నేటి గుర్తింపుతో సాంస్కృతిక సంపదను రాబోయే తరాలకు అందించడానికి ఎంతో సహాయ పడుతుంది ఆశిస్తున్నట్టు సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్నారైలంతా బాధ్యతతో రామప్పను ప్రపంచ వేదికల్లో మరింత ప్రచారం చేసి పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కృషి చెయ్యాలని మనవి చేశారు.

రామప్పను పర్యటించిన బృందంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదులతో పాటు ఉపాధ్యక్షుడు సత్య మూర్తి చిలుముల, టాక్ వ్యవస్థాపకులు మరియు ఎన్నారై తెరాస అనిల్ కూర్మాచలం ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల ఎన్నారై తెరాస సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల, స్థానిక సర్పంచ్ రజిత శ్రీనివాస్ మరియు తెరాస నాయకులు తిరుమందాస్ నరేష్ గౌడ్, రవి కుమార్ తదితరులు పర్యటించిన వారిలో ఉన్నారు.