కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. సుధా కొంగర దర్శకత్వం వహించిన “గురు” చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో తనదైన స్టైల్ చూపించారు. తన సినిమాలు ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా ఉండాలి అని కోరుకునే వెంకటేష్.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’ లో సినిమాలతో కధ బాగుంటే మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యటానికి కూడా సిద్ధం అని చెప్పిన వెంకటేష్ తాను చేసే పాత్రకి వందశాతం న్యాయం చేస్తాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వెంకటేష్ ఇప్పుడు బారిష్టర్ పార్వతీశం కథను చిత్రంగా మలచనున్నాడు.
బారిష్టర్ పార్వతీశం పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మనం చిన్నతనంలో చదువుకునే తెలుగు పుస్తకాల్లో బారిష్టర్ పార్వతీశం కథ చదివే ఉంటారు. అంతలా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బారిష్టర్ పార్వతీశం ఓ నవల అనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. మూడు భాగాలుగా వెలువడ్డ ఈ కథలో మొదతి భాగానికి సంబందించిన నవలనే తెలుగు అకాడమి పుస్తకాల్లో పదవతరగతి ఉపవాచాకముగా అందించారు.
ఒక పల్లెటూరి నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించి ఆ తర్వాత భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాదించి చివర్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఏం చేశాడన్నదే బారిష్టర్ పార్వతీశం కథ. ఇప్పుడు ఈ కథనే విక్టరీ వెంకటేశ్ ఓ సినిమాగా తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు.