ఒక్కరోజు సీఈవో..

339
MS Dhoni Becomes CEO
MS Dhoni Becomes CEO
- Advertisement -

బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. తాను ప్రచారకర్తగా ఉన్న ఆ సంస్థ ఉద్యోగులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు.ఇంతకీ విషయం ఏంటంటే..  2011నుంచి గల్ఫ్‌ ఆయిల్‌కు ప్రచారకర్తగా ఉన్న ధోనీ ఆటోమొబైల్‌ లూబ్రికెంట్స్‌తో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఒక కంపెనీకి చెందిన అసలైన సీఈవో ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకోవాలన్న ఆసక్తి ధోనికి ఎప్పటి నుంచో ఉందట.

ఈ క్రమంలో సోమవారం సీఈవో బాధ్యతలు చేపట్టిన ధోనీ ముంబయిలోని అంధేరీలో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా ధోనీని చూడటంతో ఉద్యోగులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కువగా ఫ్యాంటు, షర్టులో కనిపించే ధోనీ బ్లూ సూట్‌, తెలుపు రంగు షర్టు, మెడకు టై కట్టుకుని హుందాగా కనిపించాడు. అంతేకాదు సీఈవో హోదాలో ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి పనితీరును అడిగి తెలుసుకున్నాడు. అనంతరం జట్టు విజయాలు కోసం టీమిండియా సారథిగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో సీఈవోగా కూడా కంపెనీ ఎదుగుదల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ధోనీ వాణిజ్య వ్యవహారాలు చూసుకునే అరుణ్‌పాండే తెలిపారు. తమ కంపెనీకి ధోనీ వస్తున్నట్లు ముందుగా తెలియదని.. ఒక్కసారిగా కార్యాలయంలో అతన్ని చూడగానే తమ ఆనందానికి అవధుల్లేవని పలువురు ఉద్యోగులు తెలిపారు.

గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.

https://twitter.com/MahiRatfc/status/848853290511212545

- Advertisement -