టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్, మల్టిస్టారర్ ల హవా కొనసాగుతోంది. మల్లిస్టారర్ సినిమాలతో బిజిగా గడిపేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. జూనియర్ హీరోలతో కలిసి నటించి మల్టి స్టారర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఈమధ్య వెంకటేష్ హీరో రోల్ లో వచ్చిన సినిమాల కన్నా మల్టిస్టారర్ సినిమాలలోనే ఎక్కువగా నటించారు. మహేశ్ బాబు, రామ్, పవన్ కళ్యాణ్ తో ఇలా స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశాయి. వైవిధ్య కథలతో విభిన్నమైన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు.
త్వరలో వెంకటేశ్, నాగ చౌతన్య కాంబినేషన్ లో మరో మల్టి స్టారర్ సినిమా రానున్న విషయం తెలిసిందే. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రాన్ని కేఎస్ రవీంద్ర (బాబీ) దర్వకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రోడక్షన్ పనులలో బిజిగా ఉన్నారు డైరెక్టర్. ఈమూవీ లో వెంకీ కి సరనన హీరోయిన్ గా నయనతారను ఎంపీక చేశారు. ఇక నాగ చైతన్య సరసన సమంత నటిస్తుందని ప్రచారం చేశారు. కానీ తాజా వార్తల ప్రకారం ఈసినిమాలో చైతు పక్కన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని సమాచారం. నాగ చైతన్య సరసన రకుల్ నటించడం ఇది రెండవసారి.
మొదటగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈచిత్రానికి ప్రోడ్యూసర్ గా ముగ్గరు కలిసి నిర్మించబోతున్నట్టుగా సమాచారం. వెంకటేష్ ఫ్యామిలి బ్యానర్ సురేష్ ప్రోడక్షన్స్, తోపాటు కోన ఫిలిం కార్పోరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. వెంకటేశ్ నటించిన మల్టిస్టారర్ లో రామ్ సరసన నటించిన మసాలా సినిమా తప్ప అన్ని సినిమాలు హీట్ ను సాధించాయి. మరి మామా, అల్లుళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈచిత్రానికి ఎలా రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.