శర్వానంద్‌ సినిమాలో సునీల్…

284
Sunil to play key role in Sharwanand's Padi Padi leche manasu..
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో నెంబర్ వన్ కమిడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సునీల్. అ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలు మినహా చెప్పుకొదగ్గ విజయాలు సాధించిన చిత్రాలు లేవు. దీంతో హీరోగా కంటే కమిడియన్‌గానే ఎక్కువ పేరున్న సునీల్ మళ్లీ వెనకడుగేసి మొదటి రూట్లోనే వెళ్లాలనుకుంటున్నాడట. దీంతో పాటు అప్పుడప్పుడు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఇష్టపడుతున్నాడు.

గతంలో నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన ‘వెట్టై’ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో రీమేక్ చేసిన ‘తడాఖా’ సినిమాలో నటించి మంచి హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం అల్లరి నరేష్‌ హీరోగా భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో సునీల్  కీలక పాత్రలో నటిస్తున్నవిషయం తెలిసిందే.

 Sunil to play key role in Sharwanand's Padi Padi leche manasu..

ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే మరో మల్టీస్టారర్ చిత్రానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కోడై కూస్తున్నాయి. శర్వనంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం రూపొందుతోంది. ఆ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో నటుస్తున్నాడట. దీంతో పాటు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సునీల్ నటించబోతున్నాడు.

- Advertisement -