వెంకటాపురం: రివ్యూ

289
Venkatapuram review
Venkatapuram review
- Advertisement -

హ్యాపీడేస్ టైస‌న్ గా త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన రాహుల్‌కు త‌ర్వాత చెప్పుకునేంత పెద్ద హిట్ దొర‌క‌లేదు. చేసిన రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లాప‌డ్డాయి. రొటీన్‌కు భిన్నంగా యాక్ష‌న్ విత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో మెప్పించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మే `వెంక‌టాపురం`. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కు చాలా మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి వెంకటాపురంతో రాహుల్‌కు ఎలాంటి హిట్ వ‌చ్చింది? అస‌లు హిట్‌ వచ్చిందా? లేదా? ప్రేక్షకులను వెంకటాపురం ఆకట్టుకుందా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

క‌థ‌:

ఆనంద్‌ (రాహుల్‌) పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని జీవితంలోకి చైత్ర (మహిమ) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అతని కథ మలుపులు తిరుగుతుంది. ఓ హత్య కేసులో కూడా చిక్కుకుంటాడు. అందులోంచి ఆనంద్‌ ఎలా బయటపడ్డాడు? అసలు చైత్రకీ.. రాహుల్‌కీ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే ‘వెంకటాపురం’ కథ.

ప్ల‌స్ పాయింట్స్:
‘వెంకటాపురం’ సినిమాను అటు ఇటు తిప్ప‌కుండా స్టార్టింగ్ సీన్‌లో ద‌ర్శ‌కుడు క‌థ‌లోకి తీసుకెళ‌తాడు. ఆ సీన్ నుండే సీన్స్‌ను అల్లుకుంటూ, ఆస‌క్తిక‌రంగా సినిమాను న‌డిపించుకుంటూ వ‌చ్చాడు.కథలో మలుపులు మాత్రం ఉత్కంఠతని రేకెత్తిస్తాయి. ఓ హత్యతో ఈ చిత్రం మొదలవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ విధానంలో కథ చెప్పడం.. ఒక్కో పాత్రని పరిచయం చేయడం.. ఒక్కో ముడినీ వేసుకొంటూ వెళ్లడంతోనే తొలి సగం గడిచిపోతుంది. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్ధం జోరుగా సాగుతుంది. పతాక సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. రాహుల్ నటుడిగా కొత్తగా కనిపిస్తాడు. ఆనంద్‌ పాత్రకు ప్రాణం పోశాడు.అజయ్‌.. విశ్వనాథ్‌ కాశీ.. పాత్రల పరిధి మేర నటించారు.

venkatapuram-08

మైన‌స్ పాయింట్స్:

వేణు మడికంటి దర్శకుదడిగా పూర్తి స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు.  స్క్రీన్ ఫ్లే థ్రిల్లింగానే అనిపించినా కథలోని అసలు నిజాన్ని ఆయన చాలా చోట్ల కావాలనే బలవంతంగా దాచిపెట్టినట్లు అనిపించింది. రివీల్ చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఆ సన్నివేశాల్ని ఉన్నటుండి ముగించేయడం వంటివి చాలానే చేశాడు.

ఫ‌స్టాఫ్ విష‌యంలో కాస్తా జాగ్ర‌త్త తీసుకుని ఉండాల్సింది. ఇక సాయిప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అస్స‌లు బాలేదు. హీరోయిన్‌ ఛైత్ర సంగతి సరేసరి, చిన్న పిల్లలాగా కనపడింది. లుక్‌ పరంగా ఎక్కడా ఆట్టుకోలేదు. కాశీవిశ్వనాథ్‌ పాత్రకు వేరేవరో డబ్బింగ్‌ చెప్పారు. ప్రథమార్ధంలో వచ్చే మూడు పాటలు కథా గమనాన్ని అడ్డు తగిలేలా ఉంటాయి. స‌న్నివేశాలు చాలా వరకూ లాజిక్‌కి అందకుండా నడుస్తాయి.

సాంకేతిక విభాగం:
కథనంలో కొన్ని చోట్ల లూప్ హోల్స్ ను అలాగే వదిలేయడం, బలవంతంగా ట్విస్టును దాచడం వంటివి చేసి నిరుత్సాహపరిచారు వేణు. సాంకేతికపరంగా ఈ సినిమాని తెరకెక్కించి విధానం బాగుంది. సంగీతం.. ఛాయాగ్రహణాలు ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. కెమెరా వర్క్‌ బాగుంది. విశాఖపట్నం అందాల్ని మరోసారి వెండి తెరపై హృద్యంగా చూపించారు. దర్శకుడిలో ప్రతిభ కనిపిస్తుంది. కథ ఎలా ఉన్నా.. దాన్ని తీర్చిదిద్దే పద్ధతికి ఎక్కువ మార్కులు పడతాయి. అయితే అక్కడక్కడ కొన్ని లోటు పాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. నందు ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే కథనంలో క్లారిటీ ఇంకా బెటర్ గా ఉండేది. తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
భిన్నమైన కథ, అందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో హీరో రాహుల్ కొత్తగా ట్రై చేశాడ‌ని చెప్పొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ చాయిస్ అనొచ్చు.

విడుదల తేదీ : మే 12, 2017

రేటింగ్ : 3/5

నటీనటులు : రాహుల్, మహిమ మక్వాన్

నిర్మాత : తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్

సంగీతం : అచ్చు

దర్శకత్వం : వేణు మడికంటి

 

 

- Advertisement -