- Advertisement -
విద్య మనల్ని వెలుగు వైపు నడుపుతుందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ కోఠి మహిళ కళాశాల 14వ స్నాతకోత్సవంలో మాట్లాడిన వెంకయ్య కష్టపడే తత్వం,విలువలను కాపాడుకోవడం ద్వారానే విజయం సాధించగలమని చెప్పారు. లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డదారులు తొక్కవద్దన్నారు.
భారత్‌లో వేదకాలం నుంచే మహిళల విద్యకు ప్రాముఖ్యత ఉందన్నారు. దేశంలో ఇంకా మహిళలు అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ భవిష్యత్‌లో గొప్ప విజయాలు సాధించాలని సూచించారు.
రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగుకి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలుగులోనే పాలన జరగాలని ఆకాంక్షించారు. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వకపోతే అభివృద్ధి చెందలేమన్నారు. తల్లిదండ్రులు,మాతృభాషను,మాతృదేశాన్ని ఎప్పటికి మరవకూడదన్నారు.
- Advertisement -