రాజ్‌కోట్‌లో ‘షా’న్‌దార్ సెంచరీ

88
Prithvi Shaw century on Test debut

ఆరంగేట్రంలోనే అదరగొట్టాడు టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. రాజ్‌ కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌ మ్యాన్‌ షో చూపించాడు. ఓపెనర్ లోకేష్ రాహుల్ తొలి ఓవర్‌లోనే వెనుదిరిగిన ఏ మాత్రం అధైర్య పడలేదు. పుజారాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షా…99 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు టీమిండియా పేరు మీదున్న రికార్డులన్ని తిరగరాశాడు. భారత్ తరపున టెస్టు ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఆరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌ మెన్‌ షా.

సచిన్‌ (9 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు)ఆడిన తర్వాత టెస్టు ఆరంగేట్రం చేయగా షా 14 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. గత పదేళ్లలో భారత్‌కు ఆడిన అత్యంత చిన్న వయసు ప్లేయర్ షా. ప్రస్తుతం షా వయస్సు 18 ఏళ్ల 329 రోజులు.