ఇక బీజేపీ వ్య‌క్తిని కానన్న వెంకయ్య

195
Venkaiah naidu files nomination for VP
- Advertisement -

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా వెంక‌య్య‌నాయుడు నామినేషన్ వేశారు. రెండు సెట్ల పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు దాఖలు చేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వెంకయ్యనాయుడు నామినేషన్ పత్రాలపై టీఆర్‌ఎస్ లోకసభాపక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రతిపాదకుడిగా సంతకంచేశారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నామినేష‌న్ వేసిన త‌ర్వాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. చిన్న‌త‌నంలో త‌ల్లిని కోల్పోయాన‌ని, కానీ పార్టీనే త‌న తల్లిగా భావించాన‌ని, ఆ పార్టీ ఇప్పుడు త‌న‌ను ఈ స్థాయికి తీసుకువ‌చ్చిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. తల్లిగా భావించిన పార్టీని వీడ‌డం బాధ‌గా ఉంద‌ని భావోద్వేగానికి గురయ్యారు. త‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, దాదాపు నాలుగు ద‌శాబ్ధాలుగా రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశ సామ‌ర్థ్యం, అందం అంతా పార్ల‌మెంటరీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఉన్న‌ద‌ని, ఆ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ భిన్న‌మైంద‌ని, దాని ప‌రిపాల‌నా వ్య‌వ‌హారం భిన్న‌మైంద‌ని, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆ ప‌ద‌వికి న్యాయం చేస్తాన‌ని ఆశిస్తున్న‌ట్లు వెంకయ్య తెలిపారు.మ‌ళ్లీ 2019లోనూ ప్ర‌ధాని మోడీ తిరిగి ఎన్నిక కావాల‌న్న ఆకాంక్ష‌ను త‌న స‌హ‌చ‌రుల‌కు తెలియ‌జేసిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. చ‌ర్చ‌ల త‌ర్వాత తాను పార్టీని వ‌దిలేందుకు నిర్ణ‌యించాన‌ని, ఇప్పుడు తాను బీజేపీ వ్య‌క్తిని కాద‌న్నారు.

Venkaiah nomination

ఎన్డీఏ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతోనే వెంకయ్యనాయుడు విజయం దాదాపు ఖాయమైపోయింది. ఎన్నిక ఇక లాంఛనం మాత్రమే. యూపీఏ కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కనుక సంఖ్యాపరంగా లోక్‌సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉంది. రాజ్యసభలో సైతం ఆ మేరకు మెజారిటీని కూడగట్టుకుంది. ఉభయ సభల్లోని 790 మంది సభ్యుల్లో ముగ్గురు ఇటీవల మరణించడంతో మిగిలిన 787 మందిలో (నామినేటెడ్ సభ్యులతో కలుపుకుని) వెంకయ్యనాయుడికి గరిష్ఠంగా 550కంటే ఎక్కువ మంది ఓట్లు లభించే అవకాశం ఉంది. వెంకయ్య నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు పలువురు ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.

- Advertisement -