హ‌సీనా కోసం షారుక్‌ను ఆపేశారు..

215
- Advertisement -

శ్రద్ధా కపూర్ కొన్ని ప్రేమ కథలతో బాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పర్చుకుంది. తన ఇంతకుముందు సినిమాలైన ‘ఒకే జాను’ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ తో చలాకీ చిన్నది ప్రేమించమని అన్నది అనే టైప్ లో నటిస్తే ఇప్పుడు వస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమా ‘హసీనా పార్కర్’ గాడ్ మదర్ లా మాఫియా యువ రాణిలా కనిపించి రెచ్చిపోయి నటించింది. ఈ సినిమా ఫేమస్ గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహిం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా నిర్మించారు.

Haseena-Parkar-Official-Teaser--1497685681-1864

అయితే తాజాగా `హ‌సీనా పార్క‌ర్‌` ట్రైల‌ర్ చూపించ‌డం కోసం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమాను ఆపేశారు ముంబైలోని మ‌రాఠా మందిర్ థియేట‌ర్ యాజ‌మాన్యం. 1995 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు షారుక్ ఖాన్ సినిమా `దిల్ వాలే దుల్హానియ లేజాయేంగే` సినిమాను నిరంత‌రాయంగా ఈ థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కానీ `హ‌సీనా పార్క‌ర్‌` ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శించ‌డం కోసం `డీడీఎల్‌జే` మాట్నీ షోను ర‌ద్దు చేశారు.

హ‌సీనా, ఆమె సోద‌రుడు దావూద్ ఈ థియేట‌ర్ ఉండే డోంగ్రీ ప్రాంతానికి చెందిన వారు కావ‌డమే దీనికి కార‌ణం. ఈ విష‌యాన్ని థియేట‌ర్ వారే స్వ‌యంగా స్ప‌ష్టం చేశారు. ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శ‌న కోసం ఒక‌రోజు డీడీఎల్‌జే ప్ర‌ద‌ర్శ‌న ఆపాల‌ని `హ‌సీనా పార్క‌ర్` నిర్మాత‌లు కోరిన‌ట్లు వారు తెలిపారు. అపూర్వ లాఖియా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో హ‌సీనా పార్క‌ర్‌గా `శ్ర‌ద్ధా క‌పూర్`, ఆమె సోద‌రుడు దావూద్ ఇబ్ర‌హీంగా స్వ‌యాన శ్ర‌ద్ధా సోద‌రుడు `సిద్ధాంత్ క‌పూర్` న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 18న విడుద‌ల‌కానుంది. ప్రేమికురాలుగా కాక పగ తో రగలిపోతున్న లేడీగా గా శ్రద్ధా కపూర్ తన నటనతో అందరిని ఆశ్చర్యపరుస్తుందా చూడాలి.

- Advertisement -