ఫుల్‌ బాటిల్ తాగి.. !

233
Nani Drank Full Bottle Of Liquor!
Nani Drank Full Bottle Of Liquor!
- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నాని వరుసగా ప్రేమకథలు చేస్తూ.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.. నానికి న్యాచురల్‌ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం ఆయన నటనే కారణం. ఎలాంటి సీనైనా అద్బుతమైన టైమింగ్‌ నాని సొంతం. ఇటీవల ఆయన నటించిన ‘నిన్ను కోరి’ సినిమా ఆయనలోని నటుణ్ని మరో కోణంలో వెలికితీసింది. ఈ సినిమా చూసిన సాదారణ ప్రేక్షకుడి నుండి సెలబ్రిటి వరకు నాని నటనకు ఫిదా అయిపోతున్నారు.. ముఖ్యంగా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటుంది.. “ఈ ఆడాళ్లు అన్ని అల‌వాట్లు ఉన్న వాడిని ప్రేమిస్తారు.. ఏ ఆల‌వాట్లు లేని వాడిని పెళ్ళి చేసుకుంటారు…”. ఈ డైలాగ్ ప‌ల‌క‌డం లోనూ, న‌టించ‌డంలోనూ నానీ అదుర్స్ అనిపించాడు.. నాని నేచుర‌ల్ న‌ట‌న‌కు నిన్నుకోరి మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ చేసేశారు తెలుగు ప్రేక్ష‌కులు..

అయితే అ సీన్ పండడానికి నానీ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో వివ‌రించాడు ఈ మూవీ స‌హ నిర్మాత‌, స్కిప్ట్ రైట‌ర్ కోన వెంక‌ట్.. విజయవాడలో జ‌రిగిన ‘నిన్ను కోరి’ సక్సెస్ మీట్ లో వెంకట్ మాట్లాడుతూ, ఈ సీన్ లో న‌టించేందుకు నాని నిజంగానే ఫుల్ బాటిల్ మందు తాగేశాడని చెప్పారు. అమెరికాలో సున్నా డిగ్రీల టెంపరేచర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఓ సన్నివేశాన్ని చిత్రీకరించామ‌ని వెల్ల‌డించారు. ఆ సీన్ ను పండించడానికి నాని నిజంగానే మందు తాగాడని. అందుకే . ఆ సీన్ ఎంతో నేచురల్ గా వచ్చిందని నానీ ప్ర‌శంసించారు. ఈ ఒక్క సీన్ చాలు నాని నేచురల్ స్టార్ అని చెప్పడానికి అంటూ అభినందించారు.

- Advertisement -