ట్రెండీ పాలిటిక్స్..!

21
- Advertisement -

సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, వ్యంగ్యస్త్రాలు చేసుకోవడం సర్వసాధారణమే. ఎందుకంటే ప్రభుత్వం చేసే పొరపాట్లను ప్రతిపక్షాలు విమర్శల రూపంలో ప్రశ్నిస్తుంటే.. ప్రతిపక్షలకు ధీటుగా ప్రభుత్వ పార్టీలు అంతే స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ సమాధానం చెబుతుంటాయి. అయితే ఈ విమర్శల పరిధి కేవలం రాజకీయాల వరకు మాత్రమే పరిమితమైతే మంచిదే. కానీ ప్రస్తుత పాలిటిక్స్ లో అలా లేదు విమర్శలు కాస్త వ్యక్తిగతంగా మారిపోయి రాజకీయాలను ఒక వ్యక్తికో లేదా పార్టీకొ పరిమితం చేస్తున్నపరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పాలిటిక్స్ దేశానికి నష్టమే తప్పా ఎలాంటి ఉపయోగం లేదని విశ్లేషకులు తరచూ చెబుతూనే ఉన్నారు. యువతరం రాజకీయాల్లోకి రావాలంటే కూడా చీదరించుకునే పరిస్థితి నేటి రోజుల్లో దాపురించింది అనడంలో ఎలాంటి సందేహం లేదనేది కొందరి అభిప్రాయం.

ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సన్మాన సభలో ప్రసంగించిన వెంకయ్యనాయుడు.. ” నేటి రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడడమే ప్రధాన ఏజండాగా పెట్టుకున్నారని ” చెప్పుకొచ్చారు. బూతులు మాట్లాడుతూ రాజకీయ విలువలను తగ్గించే నేటితరం రాజకీయ నాయకులకు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. ఇక పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు దిగజారిపోతున్నాయని, ఆ మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లనని కానీ విమర్శల ధాటికి తట్టుకోలేక తాను రాజకీయాలకు దూరమైనట్లు చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:రకుల్ పాత ఫోటో వైరల్

- Advertisement -