వేములవాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

38
vemulawada

దేవి శరన్నవరాత్రులు సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి 25 వరకు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

9 రోజుల పాటు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. మొదటిరోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుస్ట ఉపచార పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు.