శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు..

196
t news
- Advertisement -

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శనివారం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో గణపూజతో శాస్త్రోక్త పూజలు ఆరంభించి యాగశాల ప్రవేశం, అఖండదీప స్థాపన మరియు కలశస్థాపన పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని ఈఓ కేఎస్ రామారావు చెప్పారు.

తొలిరోజు శ్రీశైల శ్రీ భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించి దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు, విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహన సేవలో విహరించనున్నారు. ఇందులో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆలయ ఆవరణలోనే ఉత్సవం జపిస్తారు.

కొవిడ్ నేథప్యంలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయ ఈఓ కేఎస్ రామారావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతికి అడ్డం పట్టే బతుకమ్మ పండుగ చేసుకునే భక్తులు శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితి గా వస్తుందని అర్చక వేదపండితులు చెపుతున్నారు.

- Advertisement -