నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉందని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇతర రాష్ట్రాల 447 నుంచి మైగ్రేoట్ లేబర్స్ వచ్చారు. వారిని క్వారంటీన్ లకు పంపామన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో క్వారంటేయిన్ లో ఉన్న వారందరూ నెగిటివ్ రిపోర్ట్స్ తో వారి ఇళ్లలోకి వెళ్లిపోయారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ కేసులు రావటంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
5.54 లక్షల టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశామని ఇప్పటి వరకు 4.37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే రైస్ మిల్లర్ల వద్దకు కూడా ధాన్యం చేరిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పనులు రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా లాభసాటి వ్యవసాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.
కొందరు రైతు బంధు పై లేనిపోని ప్రచారం చేస్తున్నారు…కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయన్నారు. ఏ పంటలు పండిస్తే దిగుబడి వస్తుంది, ఏ కాలంలో ఏ పంట వేస్తే రైతుకు మేలు జరుగుతుంది అన్న దానిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారన్నారు..
తెలంగాణలో రైతుకు నష్టం జరగకుండా మార్కెట్లో గిట్టుబాటు ధర రావాలనేది కేసీఆర్ ఆలోచన అని శాస్త్రవేత్తల సూచన మేరకు లాభసాటి వ్యవసాయం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఈ సారి భారీగా వరి ధాన్యం వచ్చిoది…పత్తికి బాగా డిమాండ్ ఉంది. పత్తి సాగు పెరగాలన్నారు. కందులు ఎక్కువగా పండిస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు.
మక్కను 20 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే బాగుంటుందని..వరి సాగులో 50 శాతం సన్నాలు, 50 శాతం దొడ్డు బియ్యం పండిస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయం అన్నారు.