తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కను నాటి 6250 మొక్కలు పంపిణీ చేశారు పంన్నెండేళ్ల జయంత్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు,కవిత దంపతుల చిన్న కుమారుడు వీర్ల జయంత్ మొక్కలు నాటడంతో పాటు వెలిచాల గ్రామ పంచాయితీలో ఇంటింటికి 5 మొక్కలు చొప్పున మొత్తం 6250 మొక్కలను పంపిణీ చేశారు.
చిన్న వయసులోనే పర్యావరణంపై ప్రేమను పెంచుకొని ఎంపీ సంతోష్ కుమార్ స్పూర్తితో మొక్కలు పంపిణీ చేయడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు,ఉప సర్పంచ్ పుదరి వెంకటేష్,రైతు బందు సమితి జిల్లా సభ్యులు సంజీవ్ రావు,మాజీ సర్పంచ్ రవీందర్ రావు,వార్డ్ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.
Also Read:ఇలా చేస్తే హార్ట్ ఎటాక్‌కు చెక్..