Eyes:అందమైన కళ్ల కోసం

189
healthy eyes
- Advertisement -

1. టీ స్పూన్ టమాటో గుజ్జును ,చిటికెడు పసుపు ,అర టీ స్పూన్ నిమ్మరసం , ఒక టీ స్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తగా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని కనురెప్పులపై రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి . ఇలా చేస్తే కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి.

2. రోజుకు 4 సార్లు ముఖం కడుక్కోవాలి . అలివ్ నూనె , పసుపు పొడి కలిపి ముద్దగా చేసుకొని కళ్ల కింది నల్లని చారల పై రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లని చారలు తొలగిపోతాయి.

3. విటమిన్ “E ” నూనె తో కళ్ళకింది చారల పై మెల్లగా మసాజ్ చేయాలి. నిద్ర పోయే ముందు కంటి ని రోజూ మంచినీళ్ళుతో శుభ్రం చేయాలి.

4. అర టీ స్పూన్ కీర రసం లో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకొని అరగంట సేపు ఉంచి ఆతర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.

5. రోజుకు 6 గంటలు నిద్ర పోవడం వల్ల కళ్ళు చక్కగా కనిపిస్తాయి అని వైద్యులు చెప్తున్నారు.

6. కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో ముడతలు ఉన్న చోట మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Also Read:అధికమాసం అంటే ఏంటో తెలుసా?

7. గ్లాస్‌ నీటిలో రాత్రి ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.

8. ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అర గ్లాస్ పాలలో నానపెట్టాలి. రాత్రి పూట ఆ బాదం పప్పును ముద్దగా చేసుకొని కళ్ళ చుట్టూ రాస్తే నల్లగా ఉన్న వలయాలు తగిపోతాయి.

9. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు గ్రీన్ టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు ముంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్ళ కాంతి వంతంగా తయారవుతాయి.

 Also Read:బెంగళూరులో విపక్షాల భేటీ..

- Advertisement -