టాలీవుడ్ టాప్ ఓపెనర్ బాలయ్యే

46
- Advertisement -

‘పుష్ప’ సినిమా రికార్డును తాజాగా నటసింహం బాలయ్య బద్దలు కొట్టారు. ఇంతటితో ఆగకుండా టాలీవుడ్ లో టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో తన సినిమాను కూడా నిలిచేలా చేసుకున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో జోష్ పెరిగింది. రెండు రాష్ట్రాల్లో ‘పుష్ప’ ఫస్ట్ డేనే 24.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ షేర్ ను అధిగమిస్తూ.. ‘వీరసింహారెడ్డి’ సినిమా 25.36 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తానికి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఉదాహరణకు హైదరాబాద్‌లో తొలిరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వీరసింహారెడ్డి రూ.43 లక్షలు వసూలు చేసి అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఇక్కడ ‘పుష్ప’ రూ.41 లక్షలు వసూలు చేయగా.. రూ.75 లక్షల వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ టాప్‌లో ఉంది. ఇక సంక్రాంతి వేడుకల కోసం నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా నారావారిపల్లె వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే, బాలయ్య చంద్రగిరిలోని SV థియేటర్ లో సందడి చేశారు. సినిమా అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. ఆకలితో ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమా అందించామని తెలిపారు. ప్రేక్షకులు కుటుంబసమేతంగా వచ్చి వీరసింహారెడ్డి చిత్రాన్ని తిలకిస్తున్నారని వివరించారు. మొత్తానికి టాలీవుడ్ టాప్ ఓపెనర్ బాలయ్యే ఇప్పుడు నిలిచారు.

ఇవి కూడా చదవండి…

మరాఠీ వేద్ రికార్డుల వర్షం…

పోలీస్‌ పాత్రలో డార్లింగ్‌..!

అవతార్ 2 దర్శకుడి పై జక్కన్న ట్వీట్

- Advertisement -