పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

107
- Advertisement -

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూసి నది వద్ద విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వేదకుమార్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని.. ఈరోజు నారాయణపేట ఎస్పీ చేతన ఐపీఎస్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి నేను కూడా ఇందులో భాగస్వామ్యం అయి మొక్కలు నాటాను అని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారని అన్నారు. ఒకరు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం అలా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకుంటున్నారని ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మూసి నది వద్ద విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని అదేవిధంగా నదులను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేదకుమార్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తు.. ఈ దసరా పండుగ కు ఎంపీ సంతోష్ కుమార్ 20 వేల జమ్మిచెట్లు పంపిణీ చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగస్వామ్యం అయి తన వంతు కృషి చేస్తానని వేదకుమార్ తెలిపారు.

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా పద్మశ్రీ శాంతా సిన్హా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ ఎన్ కె.పటేల్, సన్ బిల్డర్స్ ప్రెసిడెంట్ ఫౌండర్ చైర్మన్ నవీన్ పిప్లానీ, ప్రెసిడెంట్ ఐ కామస్ ఇండియా హరిప్రిత్ సింగ్ ఐఏఎస్‌,స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ MCRHRD మహమ్మద్ షఫీయుళ్ల ,రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, మను యూనివర్సిటీ. ఐదుగురికి ఛాలెంజ్ విసిరారు వేదకుమార్. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -