కాంగ్రెస్-టీడీపీ పొత్తు..హస్తం పార్టీకి వట్టి గుడ్‌ బై

218
vatti vasantha kumar
- Advertisement -

కాంగ్రెస్-టీడీపీ కలయికపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా హస్తం-సైకిల్ పార్టీ కలయికను ఇరు పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీతో కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ లో ఉండబోనని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో తన భవిశ్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ‌ను పంపారు.

ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీఆర్.. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వైరి పక్షాలుగానే ఉన్నాయి. అలాంటి రెండు పార్టీలు కలవడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

- Advertisement -