వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా రెండోసారి…వాసుదేవారెడ్డి

188
vasudevareddy

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టారు వాసుదేవరెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆశయం మేరకు దివ్యాంగులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా చూస్తానని ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, వికలాంగుల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.