ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా..

308
prashanth bhushan

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులో శిక్షను ఖరారు చేసింది సుప్రీం కోర్టు.ఒక రూపాయి జరిమానాను విధించిన సర్వోన్నత న్యాయస్థానం….సెప్టెంబర్‌ 15 నాటికి రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.డిపాజిట్‌ చేయకపోతే మూడునెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తామని పేర్కొంది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ SA బాబ్డే, సుప్రీంకోర్టుపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు ప్రశాంత్ భూషణ్. దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఓ లాయర్ అయివుండీ ఇలా చెయ్యడం కరెక్టు కాదని తెలిపింది. అయితే ప్రశాంత్ భూషణ్ మాత్రం ఇందులో తప్పేమీ లేదన్నారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ప్రశాంత్ భూషణ్‌కి మద్దతుగా నిలిచారు.

సుప్రీంకోర్టు జడ్డీలు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టకూడదనీ, తమను తాము సమర్థించుకుంటూ… వివరణలు ఇచ్చుకోకూడదని వేణుగోపాల్ అన్నారు. సుప్రీంకోర్టు మాత్రం… ఇది కరెక్టు కాదని చెప్పింది.