వేదాంతం రాఘవయ్య…హీరో ఎవరో తెలుసా..

224
sunil

గద్దలకొండ గణేశ్‌ తర్వాత కాసింత గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా తన నెక్ట్స్ సినిమా అనౌన్స్‌చేశారు. అయితే ఈ సారి మెగాఫోన్ పట్టకుండా కథను అందిస్తున్నారు. ఈ సినిమాకు అలనాటి నటుడు వేదాంతం రాఘవయ్య పేరు ఖరారు చేయగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.

ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించనుండగా 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట,గోపి అచంట నిర్మిస్తున్నారు. డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. హరీష్ శంకర్ తన శిష్యుల్లో ఒకరిని పరిచయం చేసే అవకాశం ఉంది.