వరినాట్లు వేసిన కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు..

543
bhupalpally collector
- Advertisement -

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు జోరందుకున్నాయి. వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. వర్షాలు కురవడంతో రైతుల ముఖాల్లో వెలుగులు నిండాయి. చెరువులు, కుంటలు, వాగుల కింద వరినాట్ల సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు పలు జిల్లాల కలెక్టర్లు గ్రామాలబాట పట్టారు. రైతులను నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రైతుల్లో ఉత్సాహం నింపించేందుకు వారితో కలిసి నడుస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేశారు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. స్వయానా కలెక్టర్ వచ్చి వరినాట్లు వేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -