ఇద్దరి భామలతో మెగా హీరో రొమాన్స్‌..!

321
- Advertisement -

“గౌతమీపుత్ర శాతకర్ణి”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ “ఫిదా, తొలిప్రేమ” చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి “ఘాజీ” చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతోపాటు తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Varun Tej to romance Aditi Rao Hydari and Lavanya Tripathi

స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికలుగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ఆల్రెడీ స్పెషల్ ట్రయినింగ్ కూడా తీసుకోవడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.

- Advertisement -