చెర్రీ కోసం త్యాగం చేసిన తేజ్..!

211
varun tej ram charan
- Advertisement -

టాలీవుడ్ సంక్రాంతి సమరానికి సిద్దమవుతున్నారు టాప్ హీరోలు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌తో సిద్దమవుతుండగా రామ్ చరణ్ సైతం వినయ విధేయ రామతో సై అంటూ వస్తున్నాడు. అయితే సంక్రాంతికి మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్-వెంకటేష్‌ హీరోలుగా నటిస్తున్న ఎఫ్2 కూడా విడుదల కావాల్సి ఉంది.

అన్న రామచరణ్‌ మూవీ వస్తుండటంతో బరి నుంచి తప్పుకున్నాడు వరుణ్‌ తేజ్. వినయ విధేయ రామ విడుదలైన తర్వాత గ్యాప్ తీసుకుని ఎఫ్‌2ని విడుదల చేయాలని సూచించాడట. అయితే దీనికి ప్రొడ్యుసర్‌ దిల్ రాజు అంగీకరిస్తాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది.

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 తెరకెక్కుతోంది. ఎవరు ఫన్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్‌ క్యారెక్టర్‌లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది‌.

- Advertisement -