తేజు..’తొలిప్రేమ’ ఎవరితో తెలుసా..!

223
Varun Tej.. Rashi Khanna film Titled Tholiprema

ఫిదా మూవీతో మళ్లీ సక్సెస్ బాటపట్టిన మెగా హీరో వరుణ్ తేజ్‌.  ప్ర‌స్తుతం వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో నటిస్తున్నాడు.  రాశి ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి పవన్ మూవీ టైటిల్‌ ‘తొలి ప్రేమ’ను ఫిక్స్ చేశారు.

తొలి ప్రేమ టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ.. సినిమా ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేసింది. ఆహ్లాదంగా ఉన్న ఈ ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే.. ఇదో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్థ‌మౌతోంది. ‘ఎ జ‌ర్నీ ఆఫ్ ల‌వ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

 Varun Tej.. Rashi Khanna film Titled Tholiprema

త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మాత‌. 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన కరుణాకరన్‌ దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వచ్చిన ‘తొలి ప్రేమ’ ఘ‌న‌విజ‌యం సాధించింది.  మరి తేజుకి ఎలాంటి హిట్ ఇస్తుందో వేచిచూడాలి.