బడుగుల బాంధవుడు..కేసీఆర్

293
BC times in Telangana
- Advertisement -

70 ఏళ్ల స్వతంత్ర్య భారతం…దేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం కేసీఆర్ సమగ్రప్రణాళికతో ముందుకువెళుతున్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అన్నివర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నారు.ఇందులో భాగంగానే బీసీల అభివృద్ధి కోసం స్పష్టమైన విజన్‌తో  వారి జీవితాల్లో వెలుగుల నింపేంలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

ఆదివారం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ బీసీల  అభివృద్ధి కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

 BC times in Telangana
వృత్తులను నమ్ముకొని వేరే పని లేకుండా ఉన్న ఎంబీసీల కోసం  ప్రత్యేకించి ఎంబీసీ కార్పొరేషన్‌ను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేశారు.  75 శాతం సబ్సిడీపై చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో పాటు  మత్స్య పరిశ్రమ,రజకులు,నాయీ బ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలన్న డిమాండ్‌కు సానుకూలంగా స్పందించారు.  బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాజకీయాలకు అతీతంగా అందరు ఏకతాటిపైకి రావాల్సిన విషయాన్ని గుర్తుచేస్తూనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని అన్నిపార్టీలు కోరుకుంటున్నాయని, దీన్ని తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌గా కేంద్రం ముందుంచుతామనడంపై అన్నిపార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

 BC times in Telangana
గత ముఖ్యమంత్రులు ఇప్పటివరకు బీసీలను కేవలం ఓట బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో బీసీల అభ్యున్నతికి బాటలు వేస్తుండాన్ని సబ్బండ వర్గాలు మెచ్చుకుంటున్నాయి. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినందుకు ఎమ్మెల్యేలు కే లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  బీసీల కోసం ఇంతగా ఆరాటపడే నేతను కేసీఆర్ లోనే చూస్తున్నని ఆర్‌.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ కొనియాడారు.

కేసీఆర్ తెలంగాణను బహుజన్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారన్న భావం అందరిలో వ్యక్తమవుతోంది. ప్రతీ బీసీ కులాల్లోని కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందే విధంగా కార్యక్రమాలను రూపొందించాలనే సీఎం తలంపులో భాగమయ్యేందుకు తెలంగాణ సమాజం సిద్దంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -