తెలుగు మహాసభలు..కేబినెట్ సబ్‌ కమిటీ

246
KCR visits LB stadium 
- Advertisement -

హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతానికి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో రివ్యూ నిర్వహించిన కేసీఆర్…డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేటీఆర్,తుమ్మల నాగేశ్వరరావు,చందులాల్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేవారు.

సాహిత్య అకాడమీ, ఇతర సంస్థల సమన్వయంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే తెలుగు మహాసభలకు సంబంధించి పలు చోట్ల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

KCR visits LB stadium 
ప్రగతి భవన్‌లో సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియానికి చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను చకచక పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సూచించారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని సిఎం సూచించారు. మహాసభల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఈ సభలు జరుగుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -